పౌర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించండి
1 min read– డి ఎల్ డి వో జనార్దన్ రావు
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: బుధవారం నాడు మండలంలోని దుర్వేసి గ్రామ సచివాలయాన్ని డి ఎల్ డి ఓ M. జనార్ధన్ రావ్, ఎంపీడీవో విజయసింహారెడ్డి సర్పంచ్ మండ్ల మమత ఈ ఓ ఆర్ డి తో . కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్స్ ను సిబ్బంది హాజరు సమయాన్ని పరిశీలించారు . ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న, సంక్షేమ పథకాల పై మరియు సిబ్బంది విధుల నిర్వహణ పై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో సమావేశం మందిరంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు వాలంటీర్లతో తో సమావేశం సమావేశం నిర్వహించారు సచివాలయ నిర్వహణ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుందని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆయుష్మాన్ భారత్ ఈ కేవైసీ వాలంటీర్లు పూర్తి చేయాలని ఆదేశించారు సచివాలయ సిబ్బంది సమయానికి విధులకు హాజరుకావాలని సమయానికి బయోమెట్రిక్ వేసి రిజిస్టర్ లో వారానికి మూడు రోజులు వాలంటీర్లు బయోమెట్రిక్ వేయాలని స్పందన కార్యక్రమాన్ని మ.3 గం. ల నుండి సా.5 నిర్వహించాలని ఆదేశించారు. మరియు హౌసింగ్ డి ఈ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద మండల స్థాయి లో 383 ఇళ్లు మంజూరు అయ్యాయని , 347 ఇళ్ళు రిజిస్ట్రేషన్ లు అయ్యాయని, 311 ఇళ్ళు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు జియో ట్యాగింగ్ చేశారని తెలిపారు. గడివేముల మండలాన్ని కూడా పరిధిలో చేర్చారని ఇళ్ళు మంజూరు అయ్యాయని వచ్చే డిసెంబరు 1 వ తేదీ కళ్ళ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అందరు గ్రౌండింగ్ కు సిద్దంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి తాసిల్దార్ శ్రీనివాసులు ఈ ఓ ఆర్ డి. అబ్దుల్ ఖలిక్ గ్రామ సచివాలయ సిబ్బంది గృహ నిర్మాణ శాఖ సిబ్బంది వాలంటీర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు.