PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొదుపు ఖాతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

1 min read

– ఏపీజీబీ కడప రీజినల్ మేనేజర్ శ్రీదేవి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బ్యాంకుల ద్వారా తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించి, మళ్లీ సకాలంలో రుణాలు తీసుకొని తమ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నూరు పార్కులో (fdlc) సంబంధించి ఏర్పాటుచేసిన డ్వాక్రా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పొదుపు సంఘాల మహిళలు, అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రజలు, బ్యాంకుకు సంబంధించిన లావదేవాల విషయంలో, డిపాజిట్లు, లావాదేవీలు, వడ్డీ రేట్లు, మొదలగు వివరాలన్నీ కూడా కచ్చితంగా తెలుసుకోవాలని ఆమె తెలిపారు, అంతేకాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన డ్వాక్రా సంఘాలు, సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే వారికి అధిక వడ్డీలు బాధ తప్పి, వారి అభ్యున్నతి కోసం మరింత రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని ఆమె తెలియజేశారు, సకాలంలో చెల్లించిన అప్పు ద్వారా, మహిళలకు తప్పుతుంది ముప్పు అని ఆమె డ్వాక్రా మహిళలకు తెలిపారు, డ్వాక్రా సంఘాలలో డ్వాక్రా మహిళలు ఏదైనా ఒక యూనిట్ తీసుకుని తద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడానికి, బ్యాంకులు వారికి ఎంతైనా రుణవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందని, దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు, కాగా ఈ( ఎఫ్ డి ఎల్ సి) సమావేశానికి మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది, ఈ కార్యక్రమంలో ఏపీజీబీ సీనియర్ మేనేజర్ చిరంజీవి, బ్యాంకు మేనేజర్ కె నవనీశ్వర్, వేణు, మధు, ఏ పి ఎం గంగాధర్, సీసీలు నారాయణరెడ్డి, విశ్వనాథ్, డ్వాక్రా సంఘాల మహిళలు దాదాపు 5 వందల మంది పాల్గొన్నారు.

About Author