సాంకేతిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి..
1 min read– ఏపీజీబీ మేనేజర్ వర్జిల్ జాన్
పల్లెవెలుగు , వెబ్ గడివేముల: ఆంద్రప్రగతి గ్రామీణ బ్యాంకు గడివేముల శాఖ మరియు నాబార్డ్ వారి సౌజన్యంతో మంగళవారం నాడు కొర్ర పోలుర్ గ్రామములో ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత అవగాహన పై కళాజాత బృందంచే బ్యాంకు లొవున్నటీవంటి పొదుపు పథకాలు ఋణ పథకాలు సామాజిక భద్రతకు సంబంధించిన పథకాలు సాంకేతిక సదుపాయాలైన ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవలగురించి ఖాతాదారులకు అవగాహన కల్పించారు ఏపీజీబీ మేనేజర్ వర్జిల్ జాన్ మాట్లాడుతూ ఏపీహెచ్ బి లొ ఫిక్స్ డ్ డిపాజిట్ లపై అత్యధిక వడ్డీ వస్తుందని అలాగే బ్యాంకు లొ వున్న అనేక ఋణ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విష్ణు తేజనాయుడు వ్యాపార ప్రతినిది బజారి బి సీ లు మరియు బ్యాంకు సిబ్బంది ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.