PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డెర్మటాలజీ పిజీ వైద్య విద్యార్థులకు బహుమతులు

1 min read

– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెర్మటాలజీ విభాగపు డెర్మటాలజీ పిజీ వైద్య విద్యార్థులు బహుమతులను అందజేసినట్లు తెలిపారు. విశాఖపట్టణం లో జరిగిన డెర్మాజోన్ చర్మవ్యాధుల కాన్ఫరెన్స్ నందు కర్నూల్ మెడికల్ కాలేజీ, మరియు ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం నుండి బహుమతులు సాధించిన పిజీ వైద్య విధ్యార్థులను ప్రిన్సిపాల్ డా. పి. సుధాకర్ గారు, సూపరింటెండెంట్ డా. నరేంద్రనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించి బహుమతులను ప్రధానం చేశారు. రాబోవు రోజుల్లో ఇంకా మరెన్నో బహుమతులు తీసుకురావాలని మరియు కాలేజీకి మంచి పేరు తేవాలని తెలిపారు. డెర్మటాలజీ విభాగనికి లేజర్ వంటి పరికరాలు తెప్పించుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ DME& ప్రిన్సిపాల్, డా. సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, చర్మ వ్యాధుల విభాగ అధిపతి, డా.పెంచలయ్య, డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫసర్లు, పిజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.

ప్రభుత్వ, విశాఖపట్టణంలో, చర్మవ్యాధులు, కాన్ఫరెన్స్​

About Author