ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అందించాలి
1 min read– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఆశా కార్యకర్తలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఏలూరులోని ఉ దరాజురామం భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 3వ మహాసభలు నిర్వహించారు. సభలకు జిల్లా అధ్యక్షులు డి. జ్యోతి, పి. కమల,మేరీ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు చేతులు రావడం లేదన్నారు. సంబంధం లేని పనులు చేయిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు.జిల్లాw2 కార్యదర్శి కె.పోకమ్మ, సీఐటీయూ నాయకులు | రాజారామ్మోహన్రాయ్, డీఎన్ఏవీడీ ప్రసాద్, లింగరాజు మాట్లాడారు, కార్యక్రమం విజయవంతం చేశారు.