సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి : సిఐటియు
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: కార్మిక హక్కులను కాలరాస్తే ఉద్యమం ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు,జిల్లా కమిటీ కార్యవర్గ కె.భాస్కర్ రెడ్డి అన్నారు.స్థానిక మండల కేంద్రమైన ఎంపీపీ పాఠశాలలో సిఐటియు మహాసభలు జరిగాయి.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం కోసం పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26వేలు ఇవ్వాలన్నారు.అనంతరం మండల నూతన కమిటీనీ 25 మందితో ఎన్నుకున్నారు.మండల నూతన కమిటీ అధ్యక్షులు లింగస్వామి, ఉపాధ్యక్షులు శ్రీను,కార్యదర్శి జి.నాగమణి సహాయకార్యదర్శివెంకటశివుడు, సులోచన,సుబ్బమ్మ, శకుంతలమ్మ,కోశాధికారి ప్రభాకర్ కమిటీని ఎన్నుకున్నారు.ఈకార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి లింగస్వామి, కెవిపిఎస్ మండల కార్యదర్శి ఓబులేసు,అంగన్వాడీ కార్యకర్తలు,వీఆర్ఏలు,విఓఏలు,స్వచ్ఛభారత్ స్కావెంజర్లు,మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.