ఇరుకు సందుల్లో భారీ వాహనాలు
1 min read– నియంత్రించేది ఎవరు..
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: గురువారం సంత రోజు ప్రతివారం స్థానిక పాత బస్టాండ్ కూడలిలో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ నిత్య కృత్యమైంది నిత్యం పరిశ్రమ నుండి డీజిల్ మైలేజ్ కోసం మండల కేంద్రంలోని గడివేముల నుండి దుమ్ములేపుకుంటూ భారీ వాహనాలు వెళ్తున్న పట్టించుకునే నాధుడు లేడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు తూ తూ మంత్రంగా అడపదడపా పోలీసులు జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు రద్దీప్రదేశాల్లో భారీ వాహనాలకు సమయపాలన విధించి వెళ్ళనిస్తే అభ్యంతరం ఉండదని వేళా పాళా లేకుండా భారీ వాహనాలు తిరుగుతూ ఉండడంతో ప్రజలు ద్విచక్ర వాహనాదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది సిమెంట్ పరిశ్రమ నుండి నంద్యాలకు రహదారి వేసిన డీజిల్ మైలేజ్ కోసం భారీ వాహన యజమానులు అడ్డదారులలో రావడం నియంత్రించాల్సిన అధికారులు స్పందించకపోవడం మండల వాసులకు ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు జిందాల్ సిమెంట్ పరిశ్రమ వారు ట్రాన్స్పోర్ట్ యజమానులకు వాహనాలు గడివేములలో వెళ్లకుండా నంద్యాల నుండి ప్రయాణం చేయాలని అవగాహన కల్పిస్తున్న లారీ బాడుగ అటువైపు ఇచ్చిన పెరిగిన డీజిల్ ధరలకు కిలోమీటర్లు తగ్గడం టోల్ గేట్లను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా మండల ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు సమయపాలన విధించి తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భారీ వాహనాలను కట్టడి చేయాలని మండల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు… చూద్దాం మరి స్పందిస్తారో షరా మామూలే అంటూ వదిలేస్తారో.