PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇ డబ్యు ఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: ఇ డబ్యు ఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పు విచారకరమని జాతీయ బి.సి.సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి రఘు రాముడు యాదవ్ పేర్కొన్నారు. వెలుగోడు పట్టణంలోని బి.సి.సంఘము కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన చూస్తే ఇ డబ్యుఎస్ లు 15 శాతం ఉన్నారు.కానీ 80 శాతం పదవులు పొందుతున్నారు. బి.సి లు 55 శాతం జనాభా కలిగి కేవలం 28 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. అంటే ఇడబ్యుఎస్ లు 15 మందికి 10 మంది ఉద్యోగాలు పొందుతారు. బి.సి.లు కేవలం 28 మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతారు. అంటే ఎంత వివక్షను ప్రభుత్వాలు చుపుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇడబ్యుఎస్ లకు రిజర్వేషన్స్ అవసరమా? దేశ సంపదలో 90 శాతం అగ్రకులాల వారే పొందుతున్నారు. అలాంటి వారికి విద్యా , ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. 11 మంది జడ్జీలు రాజ్యాంగ కేసు విచారణ జరపాలి. రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. గతంలో మండల కమిషన్ సందర్భంగా తొమ్మిది మంది జడ్జీలు రాజ్యాంగ ధర్మాసనం గతంలో 50 శాతం కంటే రిజర్వేషన్లు దాటకుడదని 60 శాతానికి పెంచడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.మరి ఇప్పుడు ఓ సి లకు 10 శాతం పెంచడం ఎలా రాజ్యాంగ బద్దం అవుతుంది. ముగ్గురు జడ్జిలు కలిసి తీర్పు ఇవ్వకూడదు. 11 మంది రాజ్య ధర్మాసనం మాత్రమే హక్కు. కావున వెంటనే ఇ డబ్యు ఎస్ రిజర్వేషన్లు పై పునః సమీక్షించి తీర్పు ఇవ్వాలని ఎస్సి , ఎస్టీ , బి.సి లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేకపోతే దశల వారిగా ఉద్యమం చేపడతామని వారు తెలిపారు.

About Author