రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష పల్లెవెలుగు వెబ్, కడప : రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరమీణులకు రంజాన్( ఈద్ ఉల్ ఫితర్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అంజద్ బాష. కరోన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గతేడాది ఇళ్లలోనే రంజాన్ పండుగ చేసుకున్నామని, ఈ సంవత్సరం అల్లాహ్ దయ మరియు ప్రభుత్వ తోడ్పాటుతో, పరిమిత సంఖ్యలో సామాజిక దూరాన్ని పాటిస్తూ, ముస్లిం సోదరులు తమ మసీదులో ప్రార్ధనలు జరుపుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారికి బలికాకుండా ఉండేందుకు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు చేపడుతూ, కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్‌కు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ముస్లిం సోదరులు పూర్తిస్థాయిలో సహకరించి.. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకుందామని పిలుపునిచ్చారు.