ఐటీబీపీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : తాజాగా ఐటీబీపీ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ను ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, నవంబర్ 23తో ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ఫీజు
ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలోని పురుష అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
జీతభత్యాలు
పే మ్యాట్రిక్స్ లెవల్ 5 ప్రకారం.. ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ. 29,200 నుంచి రూ 92,300 (7వ CPC ప్రకారం) మధ్య ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో లేదా విదేశాల్లో ఎక్కడైనా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఐటీబీపీ చట్టం-1992, రూల్స్- 1994 ప్రకారం.. అపాయింట్‌మెంట్ సమయంలో అమల్లో ఉన్న ఏవైనా ఇతర నియమాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.