PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిప్ మర్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (జిప్మర్‌)… నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎసీస నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌ – సర్టిఫికెట్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌. లేదా డిప్లొమా(జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)తోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.44,900

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులను రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: నవంబరు 7

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 1

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: డిసెంబరు 10

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 18

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in

About Author