పార్కుల్లోకి మహిళలు నిషేధం
1 min readపల్లెవెలుగువెబ్ : ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడి మహిళలు స్వేచ్ఛకు దూరంగా బతుకుతున్నారు. వారిపై ఆంక్షలు విధించి ఇంటికే పరిమితం చేశారు. వారు బయటకు రావాలన్నా బోల్డన్ని ఆంక్షలు. ఈ నేపథ్యంలో వారికున్న మరో స్వేచ్ఛను కూడా తాలిబన్లు తాజాగా లాగేసుకున్నారు. జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి మహ్మద్ అకేబ్ మొహజెర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలలుగా పార్కులు, జిమ్‌లలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు చెప్పారు.