ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచ జనాభా భారీగా పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 1950 జనాభాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉందని… 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని… 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని చెప్పింది.