ఆయుష్మాన్ భారత్ నమోదులో వేగం పెంచాలి
1 min readపల్లెవెలుగు వెబ్,మిడుతూరు:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)పథకం నమోదులో వేగం పెంచాలని ఈఓఆర్డి ఫక్రుద్దీన్ అన్నారు.మండల పరిధిలోని అలగనూరు గ్రామ సచివాలయంలో ఆయుష్మాన్ భారత్ నమోదుపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎవరెవరు ఎన్ని కుటుంబాలను నమోదు చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈపథకంలో నమోదు చేయాలన్నారు.ఇంటి పన్ను,కుళాయి పన్నులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిబ్బంది హాజరు పట్టిక మరియు మూమెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. గ్రామంలో పెద్ద పాపయ్య ఇంటి సమీపంలో ఉన్న మరుగుదొడ్డిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శి ఎన్.అనురాధను ఈఓఆర్డి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్. అనురాధ మరియు సిబ్బంది పాల్గొన్నారు.