పద్మశాలీలు..దేశానికే ఆదర్శం..
1 min readపద్మశాలి సంఘం రాయలసీమ అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ
ఎమ్మిగనూరులో ఘనంగా వనభోజనోత్సవం.
పల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోని ప్రతి మనిషికి గుడ్డ(బట్టలు)ను తయారు చేసే అవకాశం.. ఒక్క పద్మశాలీయులకే ఉందన్నారు పద్మశాలి సంఘం రాయలసీమ అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (చేనేతపురి)లో శనివారం వనభోజన మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొంకతి లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలియులు ఐక్యతతో ఉండి… దేశానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన…అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్ రమేష్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు పోలే శ్రీనివాసులు, దోమ భీమేష్, పోలే ప్రసాద్, ఆడిమి ఉరుకుందు, విశ్వనాథ్ కృష్ణ, బాణ సత్యనారాయణ; శివదాసు, గురుదాసు, మాకం నారాయణ, విశ్వనాథ్ రఘు, పోతు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.