ఏపీ కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్: నగరంలోని ఏపీ కో ఆపరేటివ్ ఎంప్లాయిస్ సీఎస్డి ఎస్ కృష్ణానగర్ కార్యాలయంలో శనివారం ఆ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అసోసియేషన్ కమిటీలో మొత్తం 48 మంది సభ్యులు ఉండగా అందులో 45 మంది ఎన్నికలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి టి. నాగరమణయ్య, ఎం, వెంకటేశ్వర్లు పోటీ చేయగా… టి. నాగరమణయ్య ప్యానెల్ 39 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించింది. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా నుంచి అసిస్టెంట్ రిజిష్ట్రార్ ఎం. రమణారెడ్డి వ్యవహరించారు. టి. నాగమరణయ్య 5వ సారి అధ్యక్ష పదవికి ఎన్నిక కావడంతో సభ్యులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పి. లక్ష్మికాంత్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం. రామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు జి. రామకృష్ణ, జిల్లా జాయింట్ సెక్రటరి పి. సుజాత, జాయింట్ సెక్రటరి జనరల్ ఎం. శ్రీనివాసులు, ట్రెజరర్ కె.శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సెక్రటర్లు బ్రహ్మ య్య ఆచారి, ఖలీల్ ఉల్లా షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు టి. నాగరమణయ్య మాట్లాడుతూ కో ఆపరేటివ్ లో అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా నాగరమణయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.