పెంపుడు కుక్క కరిస్తే రూ. 10 వేల జరిమానా
1 min readపల్లెవెలుగువెబ్ : పెంపుడు జంతువులపై ప్రేమ చూపితే సరిపోదు.. వాటి విషయంలో బాధ్యత కూడా ఉండాలని నోయిడా అధికార యంత్రాంగం పేర్కొంది. నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలతో ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నెలనెలా రూ. 2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అదేవిధంగా.. ఇంట్లో మీరు ప్రేమగా పెంచుకునే కుక్కను బయటకు తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మీ కుక్క ఎవరినైనా కరిచిందంటే రూ.పదివేల జరిమానా తప్పదని నోయిడా అథారిటీ సీఈవో పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. పెంపుడు జంతువులకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు అమలుచేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.