డీఎస్ ను కలిసిన ఈటెల రాజేంద్ర..!
1 min readపల్లెవెలుగు వెబ్: తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర.. సీనియర్ నేత డి. శ్రీనివాస్ ను కలిశారు. ఆయనతో గంటసేపు చర్చలు జరిపారు. ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు రాజకీయాల గురించి ఆయనతో ఈటెల చర్చించినట్టు సమాచారం. తర్వలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ఈటెల తెలిపారు. తన ఉద్యమానికి నేతల మద్దతు కోరుతున్నట్టు ఈటెల చెప్పారు. డీఎస్ నివాసంలో ఆయన తనయుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తో కూడ కొంతసేపు చర్చించారు. మరోనే బీజేపీ నేత డా.చంద్రశేఖర్ తో కూడ ఈటెల చర్చలు జరిపినట్టు సమాచారం.