ప్రవీణ్ కుమార్ రెడ్డి పై కేసును ఉపసంహరించుకోవాలి
1 min readతెలుగునాడు ప్రజాసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, టిడిపి రాష్ట్ర నేత సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్, కమలాపురం: ప్రొద్దుటూరు నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండ్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి పై ప్రొద్దుటూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తెలుగునాడు ప్రజాసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ డిమాండ్ చేసారు. హై కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరుకు వెళ్లకుండా కమలాపురం మండలం కోకటం గ్రామంలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆదివారం మధ్యాహ్నం సాయినాథ్ శర్మ తన అనుచరులతో కలసి పరామర్శించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తామందరం వ్యక్తిగతంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినంత మాత్రాన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన పోరాటం ఆపడన్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకి గొడవకు వచ్చిన వారి పై కేసులు నమోదు చేయాల్సింది పోయి అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రవీణ్ పైన నమోదు చేసిన అక్రమ కేసులను పోలీసులు తక్షణమే ఉపసంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేసారు.. ప్రజా సేవ తలంపుతో రాజకీయం చేస్తున్న ప్రవీణ్ పై పెట్టిన కేసులన్నింటిని ఉన్నత న్యాయస్థానం కొట్టి వేస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు రాజేంద్ర రెడ్డి, నాగేంద్ర రెడ్డి, ఎల్ వి రామముని రెడ్డి, పెండ్లిమర్రి అంకిరెడ్డి, దామోదర్ రెడ్డి, శివరామిరెడ్డి, పెద్దచెప్పలి ఎం పి టి సి నాగరాజ ఆచారి, మాజీ సర్పంచ్ హరిత సుధాకర్, కొండాయపల్లె సర్పంచ్ భవాని సుధాకర్, బి సి సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.