ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినప్పుడు చిరిగిన నోట్లు వస్తే ఆందోళన తప్పదు.. పెద్ద నోటు అయితే టెన్షన్ మామూలుగా ఉండదు. మార్కెట్ లో దానిని మార్చుకోలేక, బ్యాంకుకు వెళ్తే కొంత మొత్తం చార్జీల రూపంలో వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన పడుతుంటారు. ఎవరో చేసిన దానికి ప్రతిఫలం చెల్లించాల్సి వచ్చిందేంటా అని వాపోతుంటారు. ఇకపై ఇలాంటి టెన్షన్స్ అక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేర్కొంది. ఏటీఎం విత్ డ్రా స్లిప్పును జతచేస్తూ బ్యాంకుకు ఓ దరఖాస్తు రాసి చినిగిన నోట్లను మార్చుకోవచ్చని చెబుతోంది. అయినప్పటికీ నోట్లను మార్చేందుకు బ్యాంకు నిరాకరిస్తే.. ఆ బ్యాంకుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.