నిడ్జూరులో వైద్యపరీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బుధవారం కర్నూలు మండలంలోని నిడ్జూరు గ్రామంలో మెడికల్ ఆఫీసర్ డా. విజయ మాధురి ఆధ్వర్యంలో వైద్యబృందం పర్యటించింది. బీపీ, షుగర్, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు తదితర వ్యాధులకు సంబంధించి గ్రామస్తులకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డా. విజయ మాధురి మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి రోజు నిద్రలేవగానే రెండు గ్లాసులు వేడినీళ్లు తాగాలని, కొంత వ్యాయామం చేస్తే రోగాలు దరిచేరవన్నారు. గ్రామానికే వచ్చి వైద్యసేవలు అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గ్రామస్తులు వైద్యబృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మక్బుల్, సూపర్వైజర్ నాగమణి, మద్దూరి.వెంకటస్వామి, MLHP నాగమణి గారు ANM Saraswathi , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.