PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 గ్రామాల్లో.. నేటి నుంచి ఆధార్​ సేవలు :ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్​,మిడుతూరు:మండలంలోని 8 గ్రామాలలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఈనెల 18న మాసపేట,తిమ్మాపురం,19న మాసపేట,బైరాపురం,23న చౌటుకూరు,అలగనూరు,24న చౌటుకూరు,రోళ్లపాడు, 25న దేవనూరు,వీపనగండ్ల గ్రామ సచివాలయాలలో  ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆధార్ కార్డులో తప్పు ఒప్పులు మరియు మొబైల్ నెంబరు చేర్చుట,చిరునామా మార్చుట,వేలిముద్రలను వేయటం వంటి తదితర ఆరు రకాల సేవలను మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తెలియజేశారు. అంతేకాకుండా గ్రామంలోని సచివాల సిబ్బంది మరియు వాలంటీర్లు గ్రామంలో ఉన్న వారందరికీ ఆధార్ గురించి ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామ ప్రజలకు తెలియజేయాలని ఎంపీడీవో సిబ్బందికి తెలియజేశారు. తర్వాత నిన్న మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సిబ్బంది డ్రెస్ కోడ్ మరియు ప్రతి రోజు మూడుసార్లు తప్పనిసరిగా హాజరు వేయాలని,పీఎంఏవై కింద గృహాలు మంజూరు అయిన వారు ఇల్లు కట్టించుకోకుండా ఉన్నట్లయితే వారి ద్వారా తీర్మానం రాయించుకోవాలని తర్వాత పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి పంచాయతీ తరపున తీర్మానం రాసి వ్వాలని ఎంపీడీఓ సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఏఓ దశరథ రామయ్య,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పాల్గొన్నారు.

About Author