‘నందికొట్కూరు’లో పందుల తరలింపు..
1 min readపల్లెవెలుగు వెబ్:నందికొట్కూరు మున్సిపాలిటీ లో గురువారం పందుల తరలింపు చర్యలు చేపట్టారు. పూర్తిగా పందుల నిర్ములన అయ్యే వరకూ పందులు పట్టుకునే చర్య కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ కిషోర్ తెలిపారు. పందుల వలన ప్రజలు రోగాల భారిన పడుతున్నారని కొద్ది రోజులుగా పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారుల కు వివిధ రూపాలలో ఫిర్యాదు చేశారు . దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు, పోలీసులు పందులను పట్టుకునే ప్రత్యేక బృందాన్ని రప్పించారు. మొదట విడతగా కర్నూలు రోడ్డు బైరెడ్డి నగర్, షికారి పేట, ఆర్టీసీ బస్టాండ్, పాత బస్టాండ్, శాంతి థియేటర్ ఏరియా,పగిడ్యాల రోడ్డు,ఆత్మకూరు మెయిన్‌రోడ్‌లో పందులను పట్టుకున్నారు.పందులను యజమానులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు .ఈ సందర్భంగా కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పందుల నిర్ములన కార్యక్రమం చేపట్టామన్నారు. పందుల పెంపకందారులు వాటిని ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఏఎస్సై సుబ్బారెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.