శ్రీశైలం ధర్మకర్తల మండలికి నిబంధనలు వర్తించవా..?
1 min readమల్లన్న కు భారీ గండి కొడుతున్న ధర్మకర్తల మండలి
ఈవోకు ధర్మకర్తల సభ్యులకు సమన్వయమేదీ..?
పల్లెవెలుగు వెబ్: ప్రోటోకాల్ పేరుతో ఒక్కొక్క ధర్మకర్తల సభ్యుడికి ఒక్కొక్క అటెండర్ ని నియమించిన ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కొందరు స్థానికంగా ఉండకపోయినా తమ అటెండర్ లతో ప్రోటోకాల్ దర్శనం చేస్తున్నారు. కొందరు ధర్మకర్త సభ్యులు అనుయాయులను ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ధర్మ కర్తల మండలి సభ్యులు వాళ్ల అనుయాయులను దర్శనాలు దేవస్థానం అటెండ్లతో దగ్గరుండి జరిపిస్తున్నారు. భక్తుల నుండి పలు విమర్శలు వస్తున్నాయి అవి ఏమి పట్టించుకోని కొంతమంది ధర్మకర్తల సభ్యులు ప్రధాన ద్వారం నుండి వారి అనుయాయులను వారి ఇష్టానుసారంగా తీసుకు వెళుతున్నారు స్పర్శ దర్శనాలు జరిగే వేళల్లో వారి లెటర్ ప్యాడ్లు ఉపయోగించుకొని రోజుకి అధిక సంఖ్యలో ఉచితంగా దర్శనాలకు అనుమతిస్తున్నారు. ధర్మ కర్తల మండలి సభ్యుల ఇటీవల లెటర్ ప్యాడ్లను ఉపయోగిస్తూ వాళ్ళ వారి (ఫ్రీ ఆఫ్ కాస్ట్) ప్రత్యేకంగా రాసి అధిక సంఖ్యలో వారి అటెండర్ల ద్వారా దర్శనాలు చేపిస్తున్నరు. కొందరు అసలు ఇది ధర్మకర్తల మండలినా లేదా దళారీ వ్యవస్థ నా అంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రావణం కార్తీక మాసంలో ధర్మకర్తల సభ్యులు కొంతమంది ఇక్కడే ఉండివారి అనుయాయులనుదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు అసలు ప్రభుత్వం ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసింది భక్తుల సౌకర్యార్థం కోసమా లేదా భక్తులకు సమస్యలు తెచ్చేందుకా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇటీవల ధర్మ కర్తల మండలి సభ్యురాలు సుమారు 20 మందికి పైగా ప్రత్యేకంగా తులా భారం నుండి తీసుకెళ్ళి దర్శనం చేయించడం విడ్డూరం అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.