PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడో విడత.. రూ.3,928.88 కోట్ల సాయం…

1 min read

– 52.38 లక్షల మందికి ‘వైఎస్సార్​ రైతు భరోసా’
– బటన్​ నొక్కి.. రైతుల ఖాతాలో జమ చేసిన సీఎం
పల్లెవెలుగు వెబ్​, తాడేపల్లి : ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు మూడో ఏడాది మొదటి విడత పెట్టుబడి సహాయం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి లాంఛనంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్నా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, ఏపిఎంఐపి పిడి డిడి ఉమాదేవి, సిరికల్చర్ డిడి పరమేశ్వరితో పాటు చిన్నటేకూరు గ్రామం కురువ పెద్ద ఈశ్వరయ్య, గూడూరు గ్రామం గొల్ల ఎల్లప్ప, రుద్రవరం చెందిన మద్దిలేటి, రైతులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్సాఆర్‌ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందించాం. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేశాం. ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. ఇప్పటి వరకు రూ.13,101 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశాం. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ద్వారా కర్నూలు జిల్లాలో మూడో ఏడాది మొదటి విడత పెట్టుబడి సహాయం 5,00,216 మంది లబ్దిదారులకు 275,23,30,000 కోట్ల మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ లు రైతులకు అందజేశారు.

About Author