విద్యార్థులు.. లక్ష్యంతో చదవాలి: ఎంపీపీ
1 min readపల్లెవెలుగు వెబ్, వెలుగోడు: విద్యార్థులు సెలవు రోజుల్లో తప్పకుండా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఎంపీపీ లాలం రమేష్ సూచించారు విద్యార్థులు ఏదైనా సాధించా లన్న అనుకున్న ఆశయాన్ని సాధించాలన్న గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ ఎం.ఎఫ్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గ్రంథాల శాఖలో గ్రంధాల అధికారి సుమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులు ఎంపీపీ లాలం రమేష్ , వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, లిటిల్ ఏంజిల్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎంఎఫ్ ఇమ్మానియేల్, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం ఆవాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, సిఐటియు వెలుగోడు మండల అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు మొదటగా దాడిచర్ల హరిసర్వోత్తమరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం గ్రంథాలయం నందు చదవడం మాకిష్టం అనే ప్రోగ్రాం గ్రంథాలయ అధికారి నిర్వహిస్తున్నారని అందరూ విద్యార్థులు హాజరుకావా లన్నారు గ్రంథాలయ ఉద్యమకారుడు ఆంధ్ర తిలక్ శ్రీ గాడి చర్ల హరిసర్వోత్తమరావు దేశానికి గ్రంథాలయాలకు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు అనంతరం అతిధుల ను గ్రంథాలయ శాలువలు పూలమాలతో ఘనంగా సన్మానించారు అధికారి ఈ కార్యక్రమంలో కస్తూరిబా స్కూల్ హెచ్ఎం మధుసూదనాదేవి జడ్పీహెచ్ హై స్కూల్ లైబ్రేరియన్ బదె నాయక్ వెలుగోడు దివ్యాంగుల సంఘం రంగస్వామి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.