సీమలో రాజధాని.. ప్రజల ఆకాంక్ష: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
1 min read– డిసెంబర్ 5 న రాయలసీమ గర్జనను విజయవంతం చేయండి
పల్లెవెలుగు వెబ్: గత వారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వాహనాలలో జనాన్ని తరలించి భారీ జనం వచ్చారంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని నాకు ఒక్క రోజు సమయం ఇస్తే చంద్రబాబుకు వచ్చిన జనం కంటే పది రేట్లు జనాలను తరలిస్తానని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, రాష్ట్ర వైకాపా యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ప్రజల ఆకాంక్ష అని డిసెంబర్ 5 న రాయలసీమ గర్జన పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాయలసీమ వాసులందరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక్క సీటు కూడా రాదన్నారు. వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.మూడు రాజధానులను మూడు ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. 2024 లో రాష్ట్ర ప్రజలే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు.
గత మెజార్టీ కంటే… అధిక మెజార్టీ…: నందికొట్కూరు నియోజకవర్గములో వైసీపీకి గత మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వైసీపీ 175 స్థానాలను క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జూపాడుబంగ్లా జడ్పీటీసీ జగదీశ్వర్ రెడ్డి, ఎంపిపి మురళి కృష్ణా రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణా రెడ్డి,వైస్ చైర్మన్ రమేష్ నాయుడు ,వైకాపా నాయకులు మన్సూర్, కౌన్సిలర్లు చిన్న రాజు,రావూఫ్, మజీద్ మియ్య, నాయబ్, లాలూ ప్రసాద్, నంది కళాశాల ప్రిన్సిపాల్ బద్ధుల శ్రీకాంత్, సూదిరెడ్డి రమేష్ రెడ్డి, పాతకోట రమేష్, తదితరులు పాల్గొన్నారు.