R మండగిరిలో.. ఉచిత పశు వైద్యశిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: పత్తికొండమండలము R మండగిరి గ్రామములో సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని పశువులకు ఉచిత వైద్య మును అందించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ పశు రైతులు ముద్ద చర్మ వ్యాధి (లుంపి స్కిన్ డిసిస్) బారిన పడకుండా ఉండేందుకు మొదటగా పశువులకు టీకాలు వేయించుకోవాలి, వ్యాధి సోకిన పశువును ఆరోగ్యవంతమైన పశువుల కు దూరంగా ఉంచాలి. ఈ వ్యాధి దోమ కాటుద్వారా వస్తుంది కాబట్టి పశువుల దగ్గర దోమ తెర లాంటివి వాడుతూ సాయంకాలము దోమలు రాకుండా పొగ యేర్పాటు చేయాలి. తమ పశువులకు ఎద లక్షణాలు గమనిస్తూ లక్షణాలు కనబడగానే రైతులు ఎద సూదులు పశువులు ఆసుపత్రిలో వేయించుకోవాలని రైతులు పశువుల తో పాటు పశువైద్యశాల ను సంప్రదించాలని రైతులకు తెలియజేశారు. అలాగే పొదుగు వాపు వ్యాధి లక్షణాలు గురించి ,పశువులలో తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో 215 పశువులకు ఉచితంగా వైద్యము అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం ప్రకాష్ గారు మాట్లాడుతూ రైతులు వాతావరణ వర్షము సమాచారము వ్యవసాయ పశు పోషణ సమాచారం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించి ఉచిత సలహాలు మరియు సూచనలను పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ స్వర్ణలత గారు, A H A కిషోర్, విజయ్ , రవినాయక్,గోపాల మిత్ర రంగన్న మరియు రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ ప్రకాష్, జిల్లా ప్రతినిధి నారాయణ మరియు R మండగిరి గ్రామ సర్పంచి ప్రభాకర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు .