‘శ్రీచైతన్య’ ఆధ్వర్యంలో… ట్రాఫిక్ పై అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్: నగరంలోని బుధవారపేట శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం పాఠశాల ప్రధానాచార్యులు మౌనిక నేతృత్వంలో ఏర్పాటైన విద్యార్థుల భారీ ర్యాలీని శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్బంగా AGM సురేష్ మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపేవారు తప్పకుండ హెల్మెట్ ధరించవలెనని ,అతివేగం పనికిరాదని ,వాహనాలు నడుపూతూ చాలామంది యువకులు చరవాణి మాట్లాడడం మానుకోవలెనని చెప్పారు.పాఠశాల ప్రాంతీయభాద్యులు వి .వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు వాహనాలు నడపరాదనీ ,రోడ్డుపై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించవలెనని సూచించారు .అనంతరం విద్యార్థులు బుధవారపేట లోని వీధులలో ప్లే కార్డులు పట్టుకొని ట్రాఫిక్ నియమాల గురించి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమము లో పాఠశాల ప్రాంతీయ భాద్యులు వి .వెంకటేష్ ,డీన్ వీరయ్య ఆచారి ఉపాధ్యాయులు రంగస్వామి ,ఖాదిర్ ,ఇంద్రసేనా రెడ్డి ,మహేష్ ,సురేఖ ,నిర్మల ,సుచరిత ,విద్యార్థులు పాల్గొన్నారు.