PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారుల పూజలు

1 min read

 పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రంలో ఐఎఫ్ఎస్ మరియు ఐపీఎస్ ఇద్దరు అధికారులు ఆదివారం పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఇన్స్పెక్టర్ నీలకంఠ రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏకే నాయక్ మరియు గుజరాత్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అనిల్ యాదవ్ మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు దుశ్యాలు వతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మహానంది ఫారెస్ట్ డి ఆర్ వో సుబ్బయ్య వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

About Author