PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ’ పై.. సందేహలు తీర్చండి..

1 min read

– టీడీపీ వీరబల్లి మండలాధ్యక్షుడు బానుగోపాల్ రాజు

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి:హైడ్రో ప్రాజెక్టు పై రైతులలో నెలకొన్న సందేహలను పూర్తిగా నివృత్తి చెసిన తరువాతనే ముందుకు సాగాలని టిడిపి వీరబల్లి మండల అద్యక్షులు యం భాను గోపాల్ రాజు పేర్కొన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వంగిమళ్లలో ఏర్పాటు చేస్తున్న హైడ్రో ఫవర్ ప్రాజెక్టు కు సంబంధించి శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని రైతులు అభిప్రాయాలను చెప్పేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వకుండానే సభను ముగించేశారని విమర్శించారు. ఈ సమావేశం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభలా కాకుండా వైసిపి నాయికుల సమావేశంలా మార్చేశారంటూ పలువురు రైతులు ఆవేధన వ్యక్తం చేశారన్నారు. నీటి లభ్యత పై  ఇప్పటికి అనుమానాలు రైతులలో తొలగి పోలేదని వైసిపి నేతలు ,మాటల ద్వార రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అధికంగా పోలీస్ బందోబస్తును ఎర్పాటు చేయడం అక్కడి సభ జరిగిన తీరు వల్ల రైతులు తమ అభిప్రాయాలను చెప్పుకోలేక పోయారన్నారు ఈ ప్రాజెక్ట్ తో భూములు కోల్పోయే రైతులతో పాటు నదీ పరివాహక ప్రాంతములో ఉన్న అనేక గ్రామాల రైతులకు సాగునీరు త్రాగునీరు ప్రశ్నార్ధకమంగా మారబోతుందన్నారు సభలో మాత్రం కొందరు రైతుల కు అనుకూలంగా మాట్లాడుతూ ప్రసంగించారని కానీ ముందు ముందు అవి కార్యరూపం దాల్సుతాయో లేకపోతే రైతులను ఇబ్బందుల్లో కి నెట్టేస్తారో అనే ఆందోళన వారిలో నెలకొంది అన్నారు రైతులకు ఎలాంటి నష్టం కలిగించినా వారికి అండగా నిలబడేందుకు తెలుగుదేశం పార్టీ అండగా వుంటుందన్నారు .ఈ కార్యక్రమంలో పలువురు రైతులు ,తెలుగుదేశం నాయికులు పాల్గొన్నారు.

About Author