నాణ్యత లోపిస్తే చర్యలు: డిప్యూటీ డీఈఓ
1 min readపల్లెవెలుగువెబ్, చాగలమర్రి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఈవో మహమ్మద్ బేగ్ హెచ్చరించారు. మండలంలోని చిన్నవంగలి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మద్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని తెలియజేశారు. విద్యార్థుల హాజరును బట్టీ ఆహార పదార్థాలు తయారు చేయాలన్నారు. నాణ్యమైన కోడిగుడ్లను మాత్రమే విద్యార్థులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాగలమర్రి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు రాస్తున్న ఎస్-1 పరీక్షలను పరిశీలించారు. నాడు-నేడు కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో అనురాధ, ప్రధానోపాధ్యాయులు జీవయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు.