ప్రతిఒక్కరూ క్రీడల్లో రాణించాలి:టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగం అవ్వాలని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ 9 క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అందరితో కలిసి ఆయన కూడా క్రికెట్ ఆడారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండేవాళ్లకు ప్రతి రోజు కొద్దిసేపు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్నారు. కర్నూలులో రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ తో పాటు, వైశ్యులు, మార్వాడీలు, జైనులు కూడా లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ అన్ని లీగ్ పోటీల్లోని విన్నర్స్, రన్నర్స్ తో కలిపి ఒక లీగ్ నిర్వహించేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. మహిళలను కూడా క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇక కర్నూల్ ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్న టిజి కుటుంబం ముందు వరుసలో ఉంటుందన్నారు. అధికారం ఉన్న లేకున్నా తాము ప్రజాసేవలో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కైలాష్, ఆర్యన్, హితేష్, రంజిత్, సురేష్, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.