PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు ప్రారంభం

1 min read

– క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలి..
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు అట్టహాసంగా ప్రారంభించారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు ప్రారంభమైనాయి. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ లు యుగంధర్ రెడ్డి, కలిమున్నిసా , ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాలలో మంచి ప్రతిభను కనబరచి క్రీడాలలో రాణించాలని పేర్కొన్నారు. యువత క్రీడా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పండుగ వాతావరణంలో క్రీడాలు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులలో క్రీడా నైపుణ్యం ఎంతో దాగుందన్నారు.క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలన్నారు. క్రీడా స్పూర్తితో గెలుపోటములును సమానంగా స్వీకరించాలన్నారు.నియోజకవర్గ స్థాయి పోటీలుతో క్రీడాకారులులో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందన్నారు.11నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న సంక్రాంతి క్రీడా సంబరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు మండల సింగిల్ విండో చైర్మన్ నాగ తులసి రెడ్డి , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణ రెడ్డి , వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్ , కౌన్సిలర్ లు కాటేపోగు చిన్న రాజు, నాయబ్ , అబ్దుల్ రవూఫ్, వైసిపి నాయకులు ఉస్మాన్ బేగ్, ఆర్టీసి బాబు, జబ్బర్, మార్కెట్ రాజు, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, వి.ఆర్ శ్రీను, శాలి భాష, పి.రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి,రజిని కుమార్ రెడ్డి, సర్పంచ్ జనార్థన్ గౌడు, ఎంపీటీసీలు నాగేశ్వరరావు, సురేష్ బాబు , నంద్యాల జిల్లా శాప్ కో ఆర్డినేటర్ రవికుమార్, కర్నూలు జిల్లా శాప్ కో ఆర్డినేటర్ పేరుమాళ్ళ శ్రీనాథ్, వైసిపి నాయకులు పబ్బతి రవికుమార్, నాగార్జున, సురేష్, హరీష్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author