NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాసిల్దార్ కార్యాలయంపై ఆరోపణలు..

1 min read

పల్లెవెలుగు వెబ్​ మహానంది: మహానంది మండల తాసిల్దార్ కార్యాలయం అధికారులు ప్రతి సోమవారం జరిగే స్పందన వివరాలు మీడియాకు అందించడం లేదు. అసలు అర్జీ దారులే రావడంలేదని ఎలాంటి సమస్యలు లేవని పైకి చెప్తున్నా మరి ఉన్నతాధికారుల నుండి వస్తున్న తలంటుడు పై గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మేత లేనిదే ఆవు ఎలా పాలిస్తుంది. .. సామెతగా ఇందులో మతలబు ఏమంటే దరఖాస్తుదారులు తమ పేరు చిరునామా మరియు ఆధార్ నెంబర్ తో పాటు మొబైల్ నెంబర్ వివరాలు తెలియ చేయకపోవడంతో రషీద్ ఇవ్వడానికి కుదరడం లేదని ఓ ప్రధాన అధికారి పేర్కొనడం చర్చగా మారింది .సామాన్యులు ప్రతి సోమవారం ఇచ్చే అర్జీలకు సంబంధించి రసీదులను అందజేయడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. తమకు అనుకూలమైన వారికి మాత్రమే రసీదులు ఇవ్వకుండా గోప్యంగా కార్యాలయంలో పనులు చక్కబెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల ప్రమేయంతో విభజించు పాలించు అనే విధంగా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ గ్రామంలో గడపగడప కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయగా నిలుపుదల చేయడంతో అందరి ముందే బహిరంగంగా తాసిల్దార్ కార్యాలయ అధికారిని ఓ నాయకుడు తీవ్రంగా హెచ్చరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికప్పుడు అక్కడికక్కడే అనుమతులు మంజూరుకు సంతకాలు చేసి ప్రసన్నం చేసుకున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

About Author