గడపగడప సమస్యలపై.. ఎమ్మెల్యే సమీక్ష
1 min read– మూడు సచివాలయాలకు రూ. 60 లక్షలు మంజూరు
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం లోని మూడు సచివాలయాల పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అభివృద్ధి సమస్యలపై ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ఒకటి రెండు మూడు సచివాలయాల పరిధిలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు కాలనీలలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు విద్యుత్ దీపాలు వంటి తదితర అభివృద్ధి సమస్యలపై పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అందుకు తగిన నివేదికలను సిద్ధం చేసి ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసిపి సీనియర్ నాయకుడు గంగుల మనోహర్ రెడ్డి ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి ఎంపీపీ మబ్బు బాలస్వామి వైసిపి సీనియర్ నాయకుడు గంగిశెట్టి తిమ్మయ్యశెట్టి పశు వైద్య ఉపసంచాలకులు గిడ్డయ్య తహాశీల్దార్ వెంకటశివ ఎంపీడీవో మధుసూదనరెడ్డి ఆయా శాఖల అధికారులు మండల పరిషత్ సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మూడు సచివాలయాలకు 60 లక్షల నిధులు మంజూరు
రుద్రవరం పంచాయతీలోని మూడు గ్రామ సచివాలయాలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 60 లక్షల నిధులు మంజూరైనట్లు మండల పరిషత్ అధికారులు వెల్లడించారు. రుద్రవరం గ్రామపంచాయతీ లోని మజర గ్రామాలైన రెడ్డిపల్లె తువ్వపల్లె గ్రామాలకు గాను పంచాయతీలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల పరిధిలోని కాలనీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కొక్క సచివాలయానికి రూ 20 లక్షల చొప్పున 3 సచివాలయాలకు గాను 60 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సిసి రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు విద్యుత్తు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మూడు సచివాలయాల పరిధిలో విద్యుత్ శాఖకు 7 లక్షలు సిసి రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి విద్యుత్ దీపాల కొరకు 53 లక్షలు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక నివేదికలు సిద్ధం చేసి ఆయా శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మండల పరిషత్తు అధికారులు తెలిపారు.