నాలుగో తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలి
1 min read– కాటికాపరి గుంతలు తీసే బేగరుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
– కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ఒకటవ రెండవ మూడవ నాలుగవ సచివాలయాల్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్,కాటి కాపరి గుంతలు తీసే బెగార్ల సంఘం మండల కార్యదర్శి మునిస్వామి, డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు మారేసు కెవిపిఎస్ మండల అధ్యక్షులు మాదన్న లు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ కాటి కాపరి గుంతలు తీసే బేగర్ల ను నాలుగో తరగతిలో ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలని వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు పెన్షన్ గౌరవంగా బతుకుటకు రెండు ఎకరాల సాగు భూమిని ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని, కేజీబీఎస్ సభ్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వము,ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాల్సిందిగా సచివాలయం ముందర నిరసన తెలిపి అనంతరం పంచాయతీ సిబ్బందికి కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు లక్ష్మన్న, జయరాజు, మునిస్వామి,మాదన్న, కే జి బి ఎస్ నాయకులు జయరాజు,రత్నమయ్య, దినకర్, గోవిందు, నడిపి మునిస్వామి ,డప్పు కళాకారుల సంఘం మాజీ మండల కార్యదర్శి దేవదాసు తదితరులు పాల్గొన్నారు.