సమస్యల వలయంలో పై బోగుల గ్రామం..
1 min read– కనీస సౌకర్యమైన మంచినీటి సదుపాయం కరువు…
పల్లెవెలుగు వెబ్ గడివేముల: వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనడం భూగర్భ జలాల నీటిమట్టం తగ్గిపోవడంతో సర్వసాధారణంగా వచ్చే సమస్య… ఇందుకు భిన్నంగా మండల పరిధిలోని పై భోగుల గ్రామంలో నీటి సమస్య నెలకొనడంతో చలికాలంలోనే ఈ సమస్య తీవ్రం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రామవాసులు వాపోతున్నారు గ్రీన్ కో పరిశ్రమ వారు రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని తీసుకువస్తుండడంతో కొద్దిగా సమస్య తగ్గిందని బోర్లు రీఛార్జి చేయాలని అధికారులకు విన్నవించిన స్పందించడం లేదని వేసవికాలంలో పొలాల్లో బోర్లే దిక్కని గత నెల రోజుల నుండి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన సమస్యకు స్పందించడం లేదని వాపోయారు .. జల్ జీవన్ మిషన్ కింద నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం మెరుగుపరచడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పడమే కానీ హామీ ప్రకారం సమస్యను తీర్చే చొరవ ఎక్కడిదని గ్రామస్తులు మండిపడుతున్నారు .. ఇప్పటికైనా మేల్కొనకపోతే వేసవికాలంలో తాండ గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనడం ఖాయం.