ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపాలి
1 min read: హౌసింగ్ అధికారి రఘురాం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో చేపడుతున్న జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలలో పురోగతి లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను నందికొట్కూరు నియోజకవర్గ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక అధికారి రఘురాం గురువారం, మిడుతూరు,బైరాపురం, జలకనూరు జగనన్న కాలనీ లేఔట్లలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఉగాది లోపు అధిగమించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించి ఉగాది లోగా ఇల్లు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.ఇల్లు మంజూరు అయ్యి 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇంకా బేస్మెంట్ స్థాయిలో ఉండి పోయిన లబ్దిదారులకు నోటీసులు ఇచ్చి వెంటనే మొదలు పెట్టేలా చూడలన్నారు.ఆర్థిక ఇబ్బందులున్న వారికి పొదుపు సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి వెంట హౌసింగ్ డీఈఈ ప్రభాకర్,హౌసింగ్ ఇంచార్జి ఏఈ రమేష్, పంచాయతీ కార్యదర్శులు ఫరీద్,సుధీర్ నందకుమార్, షఫీ అహ్మద్,హసీనా,విఆర్ఓ వెంకటయ్య,హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.