ఆర్థిక సాయం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పైపాలెం గ్రామానికి చెందిన ఐదవ వార్డ్ మెంబర్ పిక్కిలి వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ సహకారం వల్ల గ్రామ వైసీపీ నాయకులు ఇనాయతుల్ల మృతుని భార్యకు 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.మృతిచెందిన వార్డు మెంబర్ కు వివిధ పార్టీల నాయకులు టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి మరియు నాగలూటి టిడిపి నాయకులు సంపంగి రవీంద్రబాబు,పైపాలెం గ్రామ ఉపసర్పంచ్ మర్రి రామకృష్ణ,బిజెపి మండల కన్వీనర్ నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.