NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవత్వం లేని ’తెలంగాణ’

1 min read

–కోవిడ్​ ఆక్సిజన్​ రోగులను హైదరాబాద్​కు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం
– హైకోర్టు మొట్టికాయలు వేసినా.. బుద్ధి రాదా..?
– బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామస్వామి
– పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆక్సిజన్​తో అంబులెన్స్​లో హైదరాబాద్​కు వెళ్తున్న కోవిడ్​ రోగులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమని, మానవత్వంలేని నిర్ణయాలతో సీఎం కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నాడని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి ధ్వజమెత్తారు. కోవిడ్​ రోగుల అంబులెన్స్​లు అడ్డుకోవడంతో శుక్రవారం బీజేపీ నేతృత్వంలో పంచలింగాల హైవే స్టాఫ్​, పుట్లూరు టోల్​ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ హై కోర్టు మొట్టికాయలు వేసినా… కేసీఆర్​ ప్రభుత్వం కోవిడ్​ రోగుల అంబులెన్స్​లను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 వరకు ఆంధ్రులకు హైదరాబాద్​ ఉమ్మడి రాజధాని అని, అక్కడికి వెళ్లే హక్కు ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో బీజేపీ ఎంత వరకైనా పోరాడుతుందని, సీఎం కేసీఆర్​ మానవత్వంలేని నిర్ణయాలను మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శులు కాళింగి నరసింహ వర్మ, కాశీ విశ్వనాథ్, ఉపాధ్యక్షులు మద్దిలేటి యాదవ్, కార్యదర్శులు వెంకటహరి, సూర్య కుమార్,ముఖ్య నాయకులు చింతలపల్లి రామకృష్ణ,మీసాల గంగాధర్, చిలకా రాఘవేంద్ర, ఓబిసి మోర్చా నాయకులు మురళీ, లక్ష్మణ్ నాయుడు మహిళా మోర్చా నాయకురాలు అరుణా రెడ్డి, యువమోర్చా నాయకులు బైరెడ్డి దినేష్ రెడ్డి ఎస్టీ మోర్చా నాయకులు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author