PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన సంక్రాంతి ముగ్గుల పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డమాను గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏఐవీయఫ్ నేషనల్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలు శుక్రవారం ముగిశాయి . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బహుమతుల ప్రధానోత్సవానికి కొనేటమ్మ పల్లె, అల్లూరు, వడ్డేమాన్ గ్రామాలకు చెందిన సర్పంచులు పోతుల దామోదర్ రెడ్డి , నాగలక్ష్మయ్య , రామచంద్రుడు హాజరయ్యారు . ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు కె.రాజేశ్వరి దేవి, చైర్మన్ జి.నాగముని లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల లో ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. పోటీలలో ముగ్గులు వేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా అభినందనీయం అన్నారు . ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి రేణుక ,రెండో బొమ్మ రజిత, మూడో బహుమతి రజిత వీరితో పాటు ఏడు మందికి నాగలక్ష్మి, శరణ్య ,నందిని, గీతా, రేవతి, అలివేలమ్మ, పవిత్ర లకు కన్సోలేషన్ బహుమతులు ప్రధానం చేశారు . వడ్డమాను గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి మరియు శ్రీమంతుడు పోచ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు .

About Author