మల్లన్న సన్నిధిలో కర్ణాటక ముఖ్యమంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రీయ ధర్మ జాగృతి మహాసమ్మేళన కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర సీఎంబసవరాజు బొమ్మై,మాజీ సీఎం యడ్యూరప్ప మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రులు శ్రీశైలం లో జరుగుతున్న రాష్ట్ర ధర్మ జాగృతి మహాసమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.శ్రీ చెన్నసిద్ధరామశివాచార్య మహాస్వామి, ఉజ్జయని పీఠాధిపతి, కాశీ పీఠాధిపతులు, శ్రీప్రభుసారంగదేవస్వామీజీ, ధర్మ జాగృతి మహాసమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందినబసవేశ్వర వీరశైవ విద్యావరదాక్ సంఘ నిత్యఅన్నదాన మందిరాన్ని కర్ణాటక రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై, వెంట మాజీ సీఎం యడ్యూరప్ప ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు 400 గదులతో భక్తులకు వసతి ఏర్పాటు కానుంది. అనతరం కంబి మండప స్థలాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై కంబి మండప స్థలంలో నిర్మించనున్న సంస్కృత పాఠశాల, వేదపాఠశాల, వైద్యశాల భవనాలు. పరిశీలించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం వచ్చిన కర్ణాటక రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మే మాజీ సీఎం ఎడ్యురప్ప ఆలయ అర్చకులు వేద పండితులుఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవారి ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ ఈవో చైర్మన్ స్వామి వారి జ్ఞాపకలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి కర్ణాటక రాష్ట్రం చెందినఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్మనజీర్ జిలాని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి.