సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
1 min read– సంక్రాంతి ప్రజల జీవితాలలో కొత్త కాంతులు నింపాలి
– శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని జై జవాన్ పార్కు లో జగనన్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ స్థాయి మహిళల ముగ్గుల పోటీలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నాయకత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి నిలుస్తుందన్నారు. తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం కృషిచేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తోందన్నారు. నియోజక వర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, నందికొట్కూరు పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య , నందికొట్కూరు జడ్పీటీసీ కలీమున్నిసా , మిడ్తూరు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ , పగిడ్యాల ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి , జూపాడుబంగ్లా ఎంపీపి సువర్ణమ్మ , కొత్తపల్లి ఎంపీపీ కుసుమలత, మహిళా ప్రతినిధులు దాసి అనసూయమ్మ , ఎక్కలదేవి సలోమి , సూదిరెడ్డి రాధ , కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్, జె.రాధిక, కృష్ణ వేణి, మందాడి వాణి ,యం.లక్ష్మిదేవి, చింత లక్ష్మిదేవి, వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి, మందడి రవింద్రా రెడ్డి , రమేష్, కురువ శ్రీను శాప్ కో ఆర్డినేటర్లు రవికుమార్, శ్రీనాథ్, తదీతరులు పాల్గొన్నారు.