PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

1 min read

– డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, చెన్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు, దీనిలో భాగంగా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో 104 ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే విధంగా ఫ్యామిలీ ఫిజీషియన్( ఫ్యామిలీ డాక్టర్ల) చే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కనుగుణంగా మరింత మెరుగ్గా ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు, అలాగే ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు, రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నీ ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగినటువంటి డాక్టర్లను, సిబ్బందిని నియమించడమే కాకుండా అక్కడ మెరుగైన వైద్య వసతులు కల్పించడం జరిగింది అన్నారు, ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, చెన్నూరులో పీహెచ్సీ, సిహెచ్ సి ఓకే చోట ఉండడం వల్ల, కొన్ని ఇబ్బందులు తలెత్తడం జరుగుతున్నాయని, ప్రస్తుతం పీహెచ్ సీని కొత్త గా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లోనికి మార్చడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, దీంతో అటు కొండపేట, ఇటు చెన్నూరు టౌన్, వాసులకు ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నాగరాజు అడిషనల్ డీఎంహెచ్ఓ ఉమా మహేష్ కుమార్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ హెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీయన్ ,భాస్కర్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి చెన్నూరు టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్,, పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ చెన్నారెడ్డి, వంశీకృష్ణ, కమలాపురం నియోజకవర్గం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author