జీవో 1 రద్దు చేయాలి : సిపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : జి.ఓ నెంబర్ 1 రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ హక్కులు కాల రాస్తే పుట్టగతులు ఉండవని, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే ప్రజలు తిరగబడతారని పి రామచంద్రయ్య హెచ్చరించారు పత్తికొండలో నాలుగు స్తంభాల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవపత్రాలని భోగిమంటలో దగ్ధం చేయడం జరిగింది. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి రామచంద్రయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో 1 రద్దు చేయాలని ,జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రలు ఓదార్పు యాత్రలు రోడ్ షో లు, రోడ్లపై సభలు సమావేశాలు దీక్షలు చేయచ్చు కానీ జగన్ అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు ప్రజలు చేయకూడదా? రాజ్యాంగం నీ ఒక్కనికే హక్కులు కల్పించలేదని అందరికీ సమాన హక్కులు కల్పించిందన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు కట్టబెడితే సివిల్ సర్వీస్ ఐఏఎస్ అధికారుల సేవలు సలహాలు ఉపయోగించి పరిపాలన చేయకుండా వందల మందిని సలహాదారులుగా నియమించుకుని పరిపాలనను నాశనం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజలలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మైన్, వైన్, ల్యాండు, శాండు మాఫియా అధికార పార్టీ అండదండలతో యదేచ్ఛగా దోపిడీ చేస్తా ఉందన్నారు. రాష్ట్ర విభజన హామీలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అనునిత్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. వైఎస్సార్ జలకళ పథకం కింద ఉచిత బోర్లు వేయిస్తా అని చెప్పి చేయక పోగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టటం, నిత్యవసర ఇతర వస్తువులు ధరలు పెంచడం, చెత్త పన్ను విధించడం , పించన్ లు తొలగించడం, రైతులకు గిట్టబాటు ధర కల్పించకపోవడం , విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించడం , నిరుద్యోగులను ఉద్యోగాలూ ఇవ్వకపోవడం, కడప ఉక్కు పరిశ్రమ నిర్మిచక పోవడం , ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అనేకం వాటిని ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ప్రజలు వ్యతిరేకించకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రదర్శనలు, సభలు సమావేశాలు, నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 1 తీసుకొచ్చిందని ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టం 1861 అనుసరించి పోలీసు చట్టం 30 ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు ఇండియాకు స్వాతంత్రం వచ్చి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అందులో పౌర హక్కులు కల్పించుకుందన్నారు ఇంకా బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టాలను ఉపయోగించటం నియంతృత్వమే అన్నారు .రాజ్యాంగంలో అధికరణ 19 (1) ఏ ప్రకారం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ప్రజలు తమ అభిప్రాయాలను భావాలను వెల్లడించుకోవచ్చన్నారు అధికరణ 19 (2) ప్రకారం శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం , ప్రదర్శనలు ఊరేగింపులు నిరసనలు తెలిపే హక్కు కల్పించిందన్నారు అధికరణ 19(3) సంఘాలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం సంఘంలో సభ్యులుగా పాల్గొనటం వంటి హక్కులు పౌరులకు రాజ్యాంగం కల్పించిందన్నారు . అయితే రాజ్యాంగం హక్కులు కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో సభలు ఊరేగింపులు, ప్రదర్శనలు, నిషేదం చేయటం సమంజసం కాదన్నారు తక్షణమే జీవో నెంబర్ ఒకటిని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వ విధానాలను తీసుకెళ్తామన్నారు సిపిఐ పత్తికొండ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షులు జరిగినది మరియు పత్తికొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సిపిఐ శాఖ కార్యదర్శి ఈ గిడ్డయ్య గౌడ్ ఆధ్వర్యంలో పందికొన గ్రామం సిపిఐ శాఖ కార్యదర్శి జోలపురం కాశి ఆధ్వర్యంలో పెద్దహుల్తి గ్రామ సిపిఐ శాఖ కార్యదర్శి ఎం రాజప్ప ఆధ్వర్యంలో జీవో నెంబర్ 1 రద్దు కోరుతూ భోగిమంటలో జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గురుదాస్ ఎఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర ఎఐటియుసి నియోజక అధ్యక్షులు కార్యదర్శులు నెట్టికంటయ్య రంగన్న సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు ఎం శ్రీనివాసులు ఎం కే సుంకన్న సిపిఐ నాయకులు శంకర్ మస్తాన్ రవి ఆనంద్ కౌలుట్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.