గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలోని ఆలమూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ పాణ్యం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు దీంతో గ్రామంలో విద్యుత్ కాంతులు వెలుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అలాగే వారం రోజుల్లో గ్రామంలోకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట పల్లకి రానున్న సందర్భంగా గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పాణ్యం నాగేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అలాగే గ్రామంలో తిరుణాల మొదలవుతున్న సందర్భంగా సుమారు మూడు లక్షల రూపాయల పంచాయతీ నిధులతో గ్రామంలోని అన్ని విధులలో నూతన టెక్నాలజీతో రూపొందిన విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నామని అలాగే గ్రామస్తులకు త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా త్రాగునీరు సరఫరా పైపులు ఏర్పాటు చేసి కుళాయిలు అమర్చామన్నారు. రాత్రి వేళల్లో గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ వైసిపి నాయకులు పాణ్యం చంద్ర దేవాలయ చైర్మన్ శూలం ప్రభాకర్ మాజీ సర్పంచ్ జయరాముడు చెన్నయ్య కమీటు హుస్సేని పంచాయతీ కార్యదర్శి పాములేటి విద్యుత్తు లైన్మెన్ గ్రామ వాలంటీర్లు ప్రైవేట్ సిబ్బంది తోడ్పాటు అందించారన్నారు.