PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటుకు నోటు ఇచ్చే నాయకులను నమ్మవద్దు

1 min read

– అభివృద్ధి చేస్తున్న నాయకులను నమ్మండి..
– అల్లూరు గ్రామంలో సంక్రాంతి కబడ్డీ పోటీలు ప్రారంభం..
– అల్లూరు గ్రామస్తులు మరోసారి టీడీపీ ప్రలోభాలకు మోసపోవద్దు..
– టిడిపి నాయకులపై సెటైర్లు విసిరిన శాప్ చైర్మన్ సిద్దార్థ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు సంవత్సరాలు గ్రామంలో కనిపించని నాయకులు సైతం ఇప్పుడు గ్రామంలో మాకాం వేస్తారు..ఓటుకు నోటు అంటూ ఓటర్లను మభ్యపెట్టేందుకు జిమ్మిక్కులు పడతారని వారి మాటలను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నాయకులకు పట్టం కట్టాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి టిడిపి నాయకులను ఉద్దేశించి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండలం లోని అల్లూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఇప్పల చెంచి రెడ్డి ఆలంపూర్ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శనివారం శాప్ చైర్మన్ సిద్దార్థ ప్రారంభించారు. పోటీల నేపథ్యంలో గ్రామానికి వచ్చిన సిద్దార్థ కు గ్రామస్తులు మేళా తాళలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దార్థ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు గ్రామంలో పర్యటించినప్పుడు ఏలాంటి ఆదరణ లభించిందో ఇప్పుడు కూడా అలాంటి ఆత్మీయత ఆదరణ గ్రామ ప్రజల నుంచి లభించిందన్నారు.గత ప్రభుత్వం హయాంలో గ్రామ అభివృద్ధిని విస్మరించిన నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిమ్మల్ని డబ్బులు ఎరా చూపి ఓట్లు దండుకోవాలని ప్రలోభాలకు గురిచేస్తారని అలాంటి వారిని దూరం పెట్టాలని టిడిపి నాయకుల పై సెటైర్లు విసిరారు.నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది..ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలు ప్రజలకు మేలు చేయడానికి ,నందికొట్కూరు అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి వైసీపీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు.
నందికొట్కూరు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచి సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతూ ఉందనిఫలితంగా రైతులంతా సుఖసంతోషాలతో పాడిసంవృద్దిగా ఉండాలని సిద్దార్థ రెడ్డి అభిలాషించారు.మరోవైపు జగనన్న సంక్షేమ పథకాలతో పేద వర్గాల ప్రజలు సైతం ఆనందంగా ఉండాలన్నారు.ఈ సందర్భంలో మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్క తెలుగు వారు సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.భోగి,మకర సంక్రాంతి,కనుమ పండుగలతో ప్రారంభమైన ఈ ఏడాది మొత్తం సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కలిమున్నిసా, ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ కట్టా మంజుల, బిజినేముల గ్రామ సర్పంచి రవి యాదవ్,శాతనకోట సర్పంచి జనార్ధన్ గౌడు ,మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు శివరామ కృష్ణ రెడ్డి, వైసీపీ నాయకులు కాటం ప్రభాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, వేదవతమ్మ, పాపన్న, ఓంకార్ రెడ్డి, శేఖర్, వివిధ గ్రామాల బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author