‘ఓమ్నీ’ హాస్పిటల్ సేవలు…ప్రశంసనీయం..
1 min readభగవాన్ శ్రీ బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: బాలసాయిబాబా 62వ జన్మదినం, ప్రపంచ శాంతి సదస్సును కర్నూలు నగరంలోని శ్రీ షిరిడిసాయిబాబా దేవాలయం పక్కనున్న బాలసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయ మనోహరి, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, విశ్వహిందూ పరిషత్ సౌత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్.సాయిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, కె.వి. సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి. సుబ్బారెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు కె.ఉషాశ్రీ, డా.సుబ్రమణ్యశ్వర రెడ్డి, శ్రీ బాలసాయి హాస్పిటల్ డాక్టర్ జయప్రకాష్, విదేశాల నుంచి వచ్చిన బాలసాయి శిష్యులు ఎలియానా ఫీ, లిల్లీ జెన్సన్, డా. హినజ్ లిస్బోక్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా భక్తులకు ఓమ్నీ, అమ్మ, ఆర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యపరీక్షలు చేసి.. మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్, జ్వరం, తలనొప్పి, బ్లడ్, యూరిన్ పరీక్షలు చేసి.. మందులు అందజేశారు. దాదాపు 1000 మందికి పైగా వైద్యపరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. బాలసాయిబాబా ట్రస్ట్ తరుపున ఆయా ఆస్పత్రులు ఈ ఏడాది వందకు పైగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభిందనీయమని కొనియాడారు బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల మేనేజర్లను శాలువా కప్పి, మెమోంటోలతో సత్కరించారు.