PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట కాల్వలపై కల్వర్టులు నిర్మిస్తే సహించేది లేదు

1 min read

– చిన్న మాచు పల్లి, శేషయ్య గారి పల్లి రైతులు

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు  కేసీ కెనాల్ పరిధిలో చిన్నమాచపల్లి, అలాగే శేషయ్య గారి పల్లె కు సంబంధించి దాదాపు 2 వందల ఎకరాల కు పైగా ఆయకట్టుకు సంబంధించిన  రైతులు వరి సాగు చేసుకుంటున్నారని , అక్కడ పంట పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి కూడా ఉందని, ఈ రహదారి కొండ రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో వరిగడ్డి, అదేవిధంగా సేద్యపు పనులకు వెళ్లడం జరుగుతుందని, చిన్నమాచుపల్లి, శేషయ్య గారి పల్లి రైతులు తెలిపారు, శనివారం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు శేషయ్య గారి పల్లె పరిధిలో కేసి కెనాల్ కు ప్రక్క భూమి కొనుగోలు చేసి ప్లాట్లు వేయడం జరిగింది, అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి ప్లాట్ల లోనికి వెళ్లేందుకు రైతులకు సంబంధించిన సర్వీస్ రోడ్డును ఉపయోగించుకుంటూ అలాగే నిబంధనలకు విరుద్ధంగా కే సి కెనాల్ ఉప కాలువ పై కల్వర్టుల నిర్మించేందుకు సిద్ధమవగా అక్కడి రైతులు కల్వర్టులు నిర్మించే దానికి ఒప్పుకోలేదు,, అలాగే రైతులకు సంబంధించిన పొలాల్లోకి వెళ్లే రహదారిని సైతం వారు ఉపయోగించుకోవడంతో రైతులు మండిపడ్డారు, ఇక్కడ మేము సేద్యానికి ,వ్యవసాయ పనులకు, అదేవిధంగా వరిగడ్డి తోలుకోవడానికి వేసుకున్నటువంటి రహదారిని మీరు (రియల్ ఎస్టేట్ వ్యాపారులు) ఎలా ఉపయోగించుకుంటారని , అక్కడే ఉన్న సర్వేయర్, వీఆర్వో, ఆర్ ఐ, అలాగే కేసి కెనాల్ ఏ ఈ ఎదురుగా వారు అధికారులను నిలదీశారు, కేసీ కెనాల్ ఉపకారము మీద కల్వర్టులు నిర్మిస్తే సహించేది లేదని వారు అధికారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెగేసి చెప్పారు, అనంతరం కేసీ కెనాల్ ఏ ఈ సుబ్బరాయుడు మాట్లాడుతూ, కేసీ కెనాల్ ఉప కాలువ మీద కల్వర్టుల నిర్మించేందుకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని, అలా నిబంధనలకు విరుద్ధంగా కల్వర్టులు నిర్మిస్తే ప్రభుత్వపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు, రైతులు తమకు, తమపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగిందని ఆయన అన్నారు, ఈ సందర్భంగా సర్వేయర్ సోమశేఖర్ మాట్లాడుతూ, ప్లాట్ల విషయంలో డీకేటి భూమి ఉందని కొందరు రైతులు ఆరోపించడం జరిగిందని, అలాంటిది ఏమీ లేదని సర్వేనెంబర్ 609 లో కేసీ కెనాల్ కు సంబంధించిన 82 సెంట్లు భూమికి సంబంధించి ఎటువంటి ఆక్రమణలు జరగలేదని ఆయన తెలిపారు, ఇందులో కేసీ కెనాల్ ఉప కాలువ సర్వీస్ రోడ్డు ఉన్నాయని, అలాగే సర్వే నెంబర్ 449- ఏ లో కేసీ కెనాల్ పోరంబోకు స్థలం వదిలి రెండు అడుగులు అటుగా బౌండరీ వేయడం జరిగిందని, కేసీ కెనాల్ పురంబోకు స్థలానికి, ప్లాట్ల స్థలాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు, అనంతరం రైతులు మాట్లాడుతూ కేసీ కెనాల్ ఉప కాలువ ద్వారా దాదాపు 2 వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని అటువంటిది కాలుపై కల్వర్టులు, సర్వీస్ రోడ్డుపై ప్లాట్ల లో నికి రహదారి ఏర్పాటు చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని ఇకమీదట ఇలాంటి పనులు మానుకోవాలని వారు అటు అధికారులకు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో , ఆర్ ఐ సౌజన్య, విఆర్ఓ, శ్రీనివాసులు, రైతులు బుజ్జి రెడ్డి, పోలు స సుబ్బారావు, అచోలు విజయ భాస్కర్ రెడ్డి, మాది నేని చంటి, పాండురంగారెడ్డి, గోటూరు నారాయణరెడ్డి, నాగం వెంకటసుబ్బారెడ్డి, గొల్లపల్లె లింగారెడ్డి, మాదినేని భీమయ్య, వెంకటసుబ్బయ్య, మళ్లీ రెడ్డి, చెన్నూరు మోహన పాలకొండ, తదితర రైతులు పాల్గొన్నారు.

About Author